Dr.Suryaraju Mattimalla

My child left alone నా బిడ్డ ఒంటరి గానే వెళ్ళిపోయాడు

నా బిడ్డ ఒంటరి గానే వెళ్ళిపోయాడు

నన్ను తీసుకువెళ్లకుండా

నా బిడ్డ వెళ్ళిపోయాడు అందనంత ఎత్తుకు

నేను ఒంటరినైనాను

ఏకాంతములో ప్రశాంతత వెతుకుతున్నాను

అయినా భూ ప్రపంచములో ఎవరున్నారు మనకు తోడుగా?

నా మనసంతా నీవే నా బిడ్డ

ప్రేమంటే నీవే నా బిడ్డ

ప్రేమలేని దేశములో నుండి దేశానికి వచాను

ఇక్కడ నిన్ను పోగుట్టుకున్నాను నా బిడ్డ

తప్పంతా నాదే

పాపము కూడా నాదే నా బిడ్డ

ప్రేమంటే ఏమిటో నేర్పించావు

చావంటే ఏమిటో చూపించావు నా బిడ్డ

నీవు నిన్నే పుట్టవు నిన్నే వెళ్ళిపోయావు

నేను యాభై సంవత్సరాలు క్రితం పుట్టాను

కాని ఇంకా ఉన్నాను

నీవు లేని లోకము నా కొద్దు బిడ్డ”

 

My child left alone

Without carrying me

My child has gone too high

I am lonely

Seeking tranquility in solitude

But who are these earthly worlds with us?

You are all my heart, my child

Love is you, my child

I came to this country from that country without love

I have lost you here my child

It\'s all my fault

Even that sin is mine, my child

You taught me what love is

You have shown me what death is, my child

You are not born yourself, you are gone

I was born fifty years ago but I am still here

This world without you is my little child”

 

దేవుడు నిజం గా ఉన్నదా

ఉంటే ఎందుకు అప్పుడే పుట్టిన పిల్లల్ని తీసుకువెళుచున్నాడు?

 

Is God real?

If so, why is he taking unborn/newborn children?