Dr.Suryaraju Mattimalla

నీవే నా ప్రాణానివి You are my life

“కులము,  మతము,  గోత్రము,  రంగు,  రూపు,  మఠము,  సంస్కృతీ,

అన్ని కలిసి నా బిడ్డలని తీసుకువెళ్లాయి

అప్పుడే పుట్టిన పిల్లలు కదా చాల ఈజీ గా చంపేశారు

అప్పుడే పుట్టిన పిల్లలనే కాదు

పెద్ద వాళ్లను కూడా ఈ కులము, రంగు, మతము, సంస్కృతీ తీసేసుకుంటున్నాయి

 

ఆ కంచికచెర్ల కోటేశునీ

ఆ కమ్మోళ్ళు బలి తీసుకున్నారు కదా

మాదిగోడు కదా అందుకే అంత ఈజీ గా చెట్టుకు కట్టేసి

పెట్రోలు పోసి తగలపెట్టేసారు

ఎంత పెట్రోలు పోసి తగలపెట్టేసినా ఆ కోటేశు ఇంకా బతికే ఉన్నాడు మన చరిత్రలో

చరిత్ర అంటే చదువులేని ఆ కమ్మోళ్లకేమీ తెలుసు

చదువుకున్న మనకి తెలుసు

నా పెద్ద బిడ్డని ఆ అనాగరిక భారత దేశములో ఆ కాపు కులస్తులు చంపేశారు

నా కడుపులో బిడ్డని ఈ అనాగరిక దేశములో చంపేశారు

ఆ అనాగరిక దేశము లో కులము

ఈ అనాగరిక దేశములో రంగు

 

ఆ దేశములో కులము ఈ దేశములో రంగు

రెండు ఒక్కటే మన ప్రాణాలని తీసుకువెళ్ళటములో

ఈ రెండే నా ఇద్దరు పిల్లలని తీసుకువెళ్లాయి”

 

“Caste, Religion, Gotra, Color, Appearance, and culture

Together, they took my children.

Newborn babies are killed very easily.

Not just newborns

This caste, color, religion, and culture are taking away even the elders.

 

That Kanchikacherla Koteshu

Was killed by the Kamma caste.

 

You were untouchable; that\'s why it\'s so easy to tie you to a tree, pour gasoline on you, and set you on fire.

No matter how much gasoline is poured on you and burns you,

You are still alive in our history.

History is unknown to those uneducated Kamma bastards.

We, who are educated, know it.

 

My eldest child was killed by those Kapu castes in that barbaric country of India.

My unborn child was killed in this barbaric country.

The caste in that country is color in this country.

Both are taking our lives.

These two took my two children.”